శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (09:32 IST)

ఏపీ మంత్రి చెల్లుబోయినకు ఛాతిలో నొప్పి - ఆస్పత్రిలో అడ్మిట్

chelluboina
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణగోపాల కృష్ణకు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను హూటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచాలని మణిపాల్ ఆస్పత్రి వైద్యుల వెల్లడించారు. 
 
మంత్రి చెల్లుబోయినకు ఛాతి నొప్పి వచ్చిన వెంటనే ఆయనను తొలుత విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మరింత మెరుగైన వైద్య సేవల కోసం మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్నారు. మణిపాల్ ఆస్పత్రి వైద్యులు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను 24 గంటల పాటు పరిశీలనలో ఉంచాలని సూచించారు. కాగా, మంత్రి అస్వస్థతకు గురయ్యారన్న సంచారంతో వైకాపా శ్రేణులు ఆస్పత్రి వద్దకు చేరుకుని తమ నేత ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు.