బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (18:14 IST)

వైకాపా ఖాళీ.. 30 మంది ఎమ్మెల్యే టచ్‌లో ఉన్నారు : మంత్రి జవహర్ బాంబు

నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత వైకాపాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ రాష్ట్ర మంత్రి జవహర్ జోస్యం చెప్పారు.

నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత వైకాపాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ రాష్ట్ర మంత్రి జవహర్ జోస్యం చెప్పారు. శుక్రవారం వెల్లడైన కాకినాడ నగర పాలక సంస్థ ఫలితాల తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికిపుడు 20 నుంచి 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అయన బాంబు పేల్చారు. 
 
మిగిలిన వారు ఇతర మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారని చెప్పారు. చివరకు వైసీపీలో మిగిలేది జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. క్రైస్తవులు, ముస్లింలంతా వైసీపీ వెనుకే ఉన్నారంటూ జగన్ పదేపదే చెప్పారని... వైసీపీకి అంత సీన్ లేదనే విషయం నంద్యాల ఎన్నికతో తేలిపోయిందని అన్నారు. శిల్పా సోదరులను జగన్ బలి పశువును చేశారని చెప్పారు.