శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (15:25 IST)

ఐరెన్ లెగ్ అంటూ హేళన చేశారు ... అయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు : ఆర్కే రోజా

rk roja
తాను వార్డు మెంబరుగా కూడా గెలవలేనని, తనది ఐరెన్ లెగ్ అంటూ హేళన చేస్తూ తనపై చెడు ముద్ర వేశారని ఏపీ మంత్రి ఆర్కే.రోజా అన్నారు. అయితే, తాను ఎన్నడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదన్నారు. పట్టుదలతో ప్రయత్నించి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఇపుడు మంత్రిగా మీ ముందు నిలిచివున్నట్టు చెప్పారు. దీనికి కారణం తాను ప్రజలను నమ్ముకోవడమేనని చెప్పారు. ప్రతిభతో పాటు పట్టుదల ఉంటే ఏదేనా సాధించవచ్చని చెప్పడానికి తానే ఓ ఉదాహరణ అని రోజా అన్నారు. 
 
ఇటీవల్ రాస్ ఆధ్వర్యంలో పుత్తూరులో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి రోజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జీవితంలో మన ఎదుగుదలని కించపరిచేవారు, అభినందించేవారు ఉంటారన్నారు. మన ఎదుగుదల మన చేతిలోనే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె గర్భిణీ మహిళలకు, వృద్ధులకు దుప్పట్లు, ఊత కర్రలు, ఇతర సహాయ సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగానే ఆమె పై విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు.