ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 24 నవంబరు 2016 (16:14 IST)

రూ. 75 కోట్లతో టీడీపీ ఎమ్మెల్యే ఇంట పెళ్లి… అదిరిపోయిందంటున్నారు... ఐటీ అధికారులు వస్తారా...?

దేశం మొత్తం చిల్లర కోసం రోడ్డున పడినప్పటికీ టీడీపీ నేతలకు మాత్రం ఆ కరువు తాకలేదు. గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస చౌదరి ఏకంగా 75 కోట్లు పెట్టి కుమారుడి వివాహం చేశారనే విమర్శలు వస్తున్నాయి. మంగళగిరి వద్ద ఉన్న హాయ్‌ల్యాండ్‌ ఎదురుగా

దేశం మొత్తం చిల్లర కోసం రోడ్డున పడినప్పటికీ టీడీపీ నేతలకు మాత్రం ఆ కరువు తాకలేదు. గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస చౌదరి ఏకంగా 75 కోట్లు పెట్టి కుమారుడి వివాహం చేశారనే విమర్శలు వస్తున్నాయి. మంగళగిరి వద్ద ఉన్న హాయ్‌ల్యాండ్‌ ఎదురుగా 20 ఎకరాల స్థలంలో బుధవారం రాత్రి వివాహం జరిగింది. ఏర్పాట్లను చూసి పెళ్లికి వచ్చిన వారే అవాక్కయ్యారు.


తెలుగు రాష్ట్రాల్లో ఇంత గ్రాండ్‌గా వివాహం జరగడం ఇదే తొలిసారని అంటున్నారు. వివాహానికి దాదాపు 75 కోట్లు ఖర్చు అయినట్టు చెబుతున్నారు. వేదికతో పాటు, అతిథులకు చేసిన వసతి ఏర్పాట్లకే రూ. 25 కోట్లు ఖర్చు అయిందని చెపుతున్నారు. వివాహ ఆహ్వాన పత్రాలకు కోటి వరకు అయినట్టు చెబుతున్నారు. దాదాపు 40 వేల మంది ఈ వివాహానికి హాజరయ్యారు.
 
గుంటూరు, విజయవాడ నుంచి పెళ్లి వేదిక వరకు స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, లైటింగ్‌ ఏర్పాట్లు చేశారు. 70 భారీ జనరేటర్లతో విద్యుత్ సరఫరా చేశారు. దీనికి కోటి రూపాయలు అయినట్టు చెబుతున్నారు. అతిథుల కోసం గుంటూరు, విజయవాడలో హోటల్‌ గదులను పెద్దసంఖ్యలో బుక్‌ చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, యరపతినేని దంపతులు వేసుకున్న డ్రస్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 
 
పెళ్లి కూతురు ధరించిన ఒక్క చీర ఖరీదే 85 లక్షల ఉంటుందని వివాహానికి హాజరైన మహిళలు చర్చించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు హాజరై వధువరులను ఆశీర్వదించారు. పెళ్లి ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే గాలి జనార్దన్‌ రెడ్డి తన కూతురి వివాహాన్ని చేస్తే తన మీడియా ద్వారా పెద్దెత్తున నిరసన తెలిపిన మీడియా అధినేతలు కూడా ఈ వివాహంలో హాజరయ్యారు. అత్యంత వైభవంగా జరిగే పెళ్లిళ్ల విషయంలో ఇటీవల ఐటీ శాఖ కన్నేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఐటీ శాఖ ఏమయినా ఇటు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.