ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు - ప్రశ్నపత్రాల సంఖ్య 7 మాత్రమే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ ఏడో తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ పదో తరగతి పరీక్షల ప్రాథమిక షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.
ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 7న పరీక్షలు ప్రారంభం కానుండగా 15న ముగుస్తాయి. ఫీజును ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 10లోగా చెల్లించాల్సి ఉంటుంది. జవాబు పత్రాల మూల్యాంకనం జూన్ 17 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఫలితాలను జులై 5న ప్రకటించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.
కాగా, ఇప్పటివరకు 11గా ఉన్న ప్రశ్న పత్రాలను ఈసారి ఏడుకు కుదించారు. భౌతిక, రసాయన శాస్త్రాలకు కలిపి సైన్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. జీవశాస్త్రంలో మరో పేపర్ ఉంటుంది. మిగిలిన ఐదు సబ్జెక్టులకు ఒక్కో పేపర్ ఉంటుంది.
కొవిడ్ నేపథ్యంలో ఇప్పటివరకు పాఠశాలలు మూతపడడం వల్ల వేసవి సెలవులను రద్దు చేసిన ప్రభుత్వం.. రెండో శనివారం, ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం వంద రోజుల పదో తరగతి ప్రణాళికను సిద్ధం చేసింది.