శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:18 IST)

ఈ నెల 15 న ఏపీ వ్యాప్త సమ్మె

కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ.. ఈ నెల 15 న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టనున్నామని సిఐటియు ప్రకటించింది.

శుక్రవారం రాజాంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌. రామ్మూర్తినాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్‌ నుండి మున్సిపల్‌ కార్మికులను మినహాయించి, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ నెల 15 న నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు లాంటి కార్మిక ట్రేడ్‌ యూనియన్‌ కార్యాలయాలు కార్మిక హక్కుల పరిరక్షణా కేంద్రాలుగా ఉపయోగపడాలని పేర్కొన్నారు.