ఏపీలో జిల్లాల వారీగా ఏకగ్రీవాలైన గ్రామ పంచాయతీలు
ఏపీ వ్యాప్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 523 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 110 మంది సర్పంచ్ లు ఏకగ్రీవం కావడం గమనార్హం. ఒక్క అభ్యర్థే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవ వివరాలను అధికారులు వెల్లడించారు.
ఏపీలో తొలి విడతలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాల వారీగా ఏకగ్రీవాలైన గ్రామ పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి...
►చిత్తూరు జిల్లా- 454 పంచాయతీలకు 96 ఏకగ్రీవం
►గుంటూరు జిల్లా- 337 పంచాయతీలకు 67 ఏకగ్రీవం
►కర్నూలు జిల్లా- 193 పంచాయతీలకు 54 ఏకగ్రీవం
►వైఎస్‌ఆర్ జిల్లా- 206 పంచాయతీలకు 46 ఏకగ్రీవం
►పశ్చిమ గోదావరి జిల్లా- 239 పంచాయతీలకు 40 ఏకగ్రీవం
►శ్రీకాకుళం జిల్లా- 321 పంచాయతీలకు 34 ఏకగ్రీవం
►విశాఖ జిల్లా- 340 పంచాయతీలకు 32 ఏకగ్రీవం
►తూర్పు గోదావరి జిల్లా- 366 పంచాయతీలకు 28 ఏకగ్రీవం
►కృష్ణా జిల్లా- 234 పంచాయతీలకు 20 ఏకగ్రీవం
►ప్రకాశం జిల్లా- 229 పంచాయతీలకు 16 ఏకగ్రీవం
►నెల్లూరు జిల్లా- 163 పంచాయతీలకు 14 ఏకగ్రీవం
►అనంతపురం జిల్లా- 169 పంచాయతీలకు 6 ఏకగ్రీవం