మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2024 (11:44 IST)

మార్చి 27న "మేమంతా సిద్ధం" పేరిట జగన్ బస్సు యాత్ర

ys jagan
వైకాపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన 21 రోజుల ఎన్నికల ప్రచార బస్సు యాత్రను "మేమంతా సిద్ధం" పేరిట మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభించనున్నారు. 
 
ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర తొలి రోజు ప్రొద్దుటూరులో బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. రెండో రోజు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి బస్సు యాత్ర సాగుతుంది. మేమంత సిద్ధం బస్సు యాత్ర మూడో రోజు కర్నూలులో వుంటుంది. ఆరోజు సాయంత్రం బహిరంగ సభ నిర్వహిస్తారు.
 
సిద్ధం సభలు జరిగిన పార్లమెంటు నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి బస్సుయాత్ర అంటే ఏప్రిల్ 18 నాటికి బస్సుయాత్ర ముగుస్తుందన్నారు.