శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 7 జులై 2021 (23:28 IST)

అతి త్వరలోనే టిటిడి పాలకమండలి నియామకం: వెల్లంపల్లి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని త్వరలోనే నియమిస్తామన్నారు దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్సించుకున్నారు వెల్లంపల్లి. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు.
 
ఈ సంధర్భంగా మీడియాతో వెల్లంపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం అందరి దృష్టి టిటిడి పాలకమండలిపైనే ఉందన్నారు. పాలకమండలి నియామకంపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని.. త్వరలోనే నియమాకం జరుగుతుందన్నారు. గతంలోలాగే  సభ్యులు ఎక్కువమంది ఉండే అవకాశం ఉందన్నారు.
 
అలాగే తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి మెరుగైన సేవలు అందిస్తోందన్నారు. శ్రీవారి భక్తులకు కరోనా సమయంలోను టిటిడి అందిస్తున్న సేవలు భేష్ అంటూ కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలందరికీ తొలి విడతలో ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టి అందజేస్తున్నట్లు చెప్పారు.