గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (18:21 IST)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

apsrtc
ఎంపిక చేసిన మార్గాలు, ఏసీ బస్సుల్లో ప్రయాణ టిక్కెట్లపై ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం 20 శాతం రాయితీని ఇచ్చింది. చలికాలం కావడంతో ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. దీంతో ఏపీఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
వచ్చే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఏపీఎస్‌ఆర్టీసీ కొన్ని ఏసీ బస్సుల్లో టికెట్ ధరలపై 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎంవై దానం తెలిపారు. అంతేకాదు మిగిలిన బస్సుల్లో ఒకే సమయంలో వచ్చి వెళ్లే టికెట్లను రిజర్వేషన్ చేసుకుంటే అన్ని బస్సుల ఛార్జీలపై 10 శాతం రాయితీ ప్రకటించారు. 
 
విజయవాడ - బెంగళూరు, విజయవాడ - బెంగళూరు, అమరావతి మధ్య నడిచే వెన్నెల స్లీపర్ బస్సులపై ఆదివారం (అప్), శుక్రవారం (డౌన్) మినహా మెజిస్టిక్ బస్ స్టేషన్ వరకు 20 శాతం తగ్గింపు ఉంటుందని తెలిపారు. 
 
ఈ బస్సుల్లో రూ.1770 (సాధారణ ధర రూ.2170), అమరావతి మల్టీయాక్సిల్ ధర రూ.1530 (సాధారణ ధర రూ.1870), విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ - విశాఖపట్నం మధ్య నడిచే అన్ని అమరావతి ఏసీ బస్సులు 10 శాతం తగ్గింపుతో రూ.970 (సాధారణ ఛార్జీ రూ.1070)గా ఖరారు చేసినట్టు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు నడిచే బస్సుల్లో గత నెలలో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) 53 శాతం ఉండగా, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఓఆర్‌ 57 శాతంగా ఉంది. 
 
ఆక్యుపెన్సీ రేషియో పెంపుపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. అందుకే ఏసీ బస్సుల్లో టిక్కెట్లపై రాయితీ ప్రకటించారు. ఈ రాయితీ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.