ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2024 (16:07 IST)

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ - మోట్ ఎడ్జ్ 50 ప్రో ఫోనుపై రూ.12 వేలు డిస్కౌంట్

Flipkart
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ పేరుతో నిర్వహించిన సేల్ ముగిసింది. ఇపుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ పేరుతో సరికొత్త డిస్కౌంట్‌తో సేల్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ విక్రయాల్లో భాగంగా, సామ్‌సంగ్, మోటోరోలా, యాపిల్ వంటి కంపెనీలకు చెందిన ప్రీమియం మోడల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా మోటరోలా ఫోన్లపై కంపెనీ గణనీయమైన తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది.
 
కొన్ని నెలల క్రితమే భారత మార్కెట్లో విడుదలైన మోటో ఎడ్జ్ 50 ప్రో ఫోనుపై ఏకంగా రూ.12 వేల డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.41,999 పలుకుతున్న ఈ ఫోనును డిస్కౌంట్ మినహాయించి రూ.29,999కే దక్కించుకోవచ్చు. అంటే ఏకంగా 28 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదనంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఐదు శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను, ఎక్చేంజ్ ఆఫరులో రూ.20,000 వరకు ఆదా చేసుకోవచ్చు. పాత ఫోన్ పనితీరు ఆధారంగా దాని విలువ ఆధారపడి ఉంటుంది.
 
కాగా మోటో ఎడ్జ్ 50 ప్రో ఫోన్ కొన్ని నెలల క్రితమే మార్కెట్లో విడుదలైంది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. అల్యూమినియం ఫ్రేమ్, 6.7 అంగుళాల డిస్ ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 200 నిట్ల వరకు బ్రైట్‌నెస్, ఆండ్రాయిడ్ 14, స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో పాటు 12జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.