బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (16:41 IST)

లాక్డౌన్ వేళ పొలం పనుల్లో నిమగ్నమైన వైకాపా ఎంపీ

కరోనా వైరస్ దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్రజాప్రతినిధులంతా తమతమ ప్రాంతాలకే పరిమితమయ్యారు. అయితే, మరికొందరు మాత్రం తమతమ సొంత పనులను చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి వారిలో వైకాపాకు చెందిన అరకు లోక్‌సభ సభ్యురాలు గొడ్డేటి మాధవి ఒకరు. ఈమె తన సొంత పొలం పనుల్లో నిమగ్నమైవున్నారు. 
 
తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే గుడి దేవుడి నుంచి సంక్రమించిన భూమిలో ఆమె స్వయంగా దుక్కిదున్ని విత్తనాలు జల్లి పొలం పనుల్లో పాల్గొన్నారు. స్వగ్రామమైన శరభన్న పాలెం నుంచి నిమ్మగడ్డ వెళ్లే దారిలో ఉన్న తమ భూమిలో భౌతికదూరం పాటిస్తూ, ఆమె పొలం పనులు చేస్తున్న చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వ్యవసాయ పనులు చేయడం తనకు అలవాటేనని, కొత్తకాదని చెప్పుకొచ్చారు. లాక్డౌన్ కారణంగా తన నియోజకవర్గానికే పరిమితం కావాల్సివచ్చిందని, అందువల్ల తాను పొలం పనుల్లో బిజీగా కాలం వెళ్లదీస్తున్నట్టు చెప్పుకొచ్చింది.