మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

బీజేపీ నేతలు నిద్రపోతున్నారా? నటిస్తున్నారా? : సీపీఐ

రాష్ట్ర బీజేపీ నేతలు నిద్రపోతున్నారా? లేక నిద్ర నటిస్తున్నారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. అమరావతి రాజధాని, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లు వంటి అంశాలు రాష్ట్రంలో పెను వివాదాల్ని సృష్టిస్తున్నాయన్నారు.

ఈ అంశాలపై జీవీఆర్ శాస్త్రి విశ్లేషణ చేస్తూ ప్రధాని కార్యాలయానికి లేఖ పంపారని రామకృష్ణ తెలిపారు. ఆయన రాసిన లేఖపై ప్రధాని కార్యాలయం ఆరా తీస్తోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రతినిధులుగా ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలు ఈ అంశాలపై ఒక్కసారైనా కేంద్రం వద్ద ఇప్పటివరకు నోరు మెదపలేదన్నారు.

ప్రధానికి రాష్ట్ర బీజేపీ నేతలు కనీసం ఒక్క లేఖ కూడా రాయలేదన్నారు. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్పటికైనా మేల్కొని అమరావతి రాజధానిగా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.