శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (14:32 IST)

పోలీసులకు గుడ్ న్యూస్.. అలవెన్సుల బకాయిలు మంజూరు

police
పాలన గాడిలో పెట్టేందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లింపులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పోలీసులకు జీతాల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకున్నా.. అలవెన్సుల బకాయిలు పేరుకుపోయాయి. 
 
ఈ నేపథ్యంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడంతో పోలీసులకు ఆర్థిక భరోసా లభించింది. బకాయిల చెల్లింపులతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి పశ్చిమలో సుమారు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ స్థాయి నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ, హెచ్‌సీ, కానిస్టేబుల్ వరకూ అలవెన్సుల బకాయిలు మంజూరవుతున్నాయి. 
 
సుమారు 11 నెలలుగా పేరుకుపోయిన ట్రావెలింగ్ అలవెన్సు బకాయిలు ఒకేసారి విడుదల చేయటంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.