ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (11:09 IST)

ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు- రూ.2.27 లక్షల నగదు గోవిందా

ATM
ఏటీఎం యంత్రాన్ని మినీ డీసీఎంలో దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన పటాన్‌చెరు రుద్రారంలో జరిగింది. ఇండీక్యాష్‌ ఏటీఎంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఎంటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లారు.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నరేష్‌ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. అపహరణ సమయానికి ఏటీఎంలో రూ.2.27 లక్షలు ఉన్నట్టు ఇండీక్యాష్‌ ప్రతినిధులు తెలిపారు. 
 
పోలీసులు క్లూస్‌ బృందాన్ని రప్పించి వివరాలు సేకరించారు. అర్ధరాత్రి ఒంటిగంట దాటాక ఘటన చోటు చేసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. దుండగులు చోరీకి ముందు సీసీ కెమెరాల తీగలు కత్తిరించారు. అక్కడికి సమీపంలో ఓ టిఫిన్‌ సెంటర్‌లో ఉన్న సీసీ కెమెరాల పుటీజీ ఆధారంగా విచారణ చేపట్టారు. 
 
ఐదుగురు వ్యక్తులు ఏటీఎంను పెకిలించి మినీ డీసీఎంలో తరలించినట్టు భావిస్తున్నారు. ఇదే ఏటీఎంలో గతంలోనూ రెండు సార్లు చోరీయత్నం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.