ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబుపై దాడి... అసలు ఏం జరిగింది..?
ఏపీ ఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఉద్యోగుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. ఆఖరికి ఎంతవరకు వెళ్లింది అంటే... అశోక్ బాబుపై దాడి చేసేంత వరకు వెళ్లింది. అసలు ఏం జరిగిదంటే... ఆదివార
ఏపీ ఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఉద్యోగుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. ఆఖరికి ఎంతవరకు వెళ్లింది అంటే... అశోక్ బాబుపై దాడి చేసేంత వరకు వెళ్లింది. అసలు ఏం జరిగిదంటే... ఆదివారం గన్‌ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవోస్ భవనంలో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, సొసైటీలో అవకతవకలపై చర్చించారు. అయితే... చర్చ జరుగుతుండగానే ఉద్యోగుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడే వరకూ వెళ్లింది.
ఈ క్రమంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డిపై కొందరు దాడికి పాల్పడ్డారు. దాడిలో అశోక్‌బాబు చొక్కా చిరిగిపోయింది. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. మరి... ఈ గొడవ సమసిపోతుందో లేక ఇంకా ముదురుతుందో..?