శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శుక్రవారం, 15 జూన్ 2018 (19:48 IST)

పవన్ కళ్యాణ్‌ పరువును నడిరోడ్డుపై లాగేస్తున్న జనసేన నేతలు..

పార్టీ పూర్తిగా ఏర్పడకముందే అంతర్గత విభేధాలతో రచ్చకెక్కుతున్నారు. అఫిషియల్‌గా వీళ్ళు మా నాయకులంటూ జనసేన పార్టీ తరపున ఇంతవరకు ఎవరూ లేరు. కానీ తమకు తాముగా నాయకులమంటూ చెప్పుకుంటూ అప్పుడే తన్నులాటలు మొదలుపెట్టారు. తిరుపతిలో జనసేన పార్టీ నాయకుల మధ్య అంతర్

పార్టీ పూర్తిగా ఏర్పడకముందే అంతర్గత విభేధాలతో రచ్చకెక్కుతున్నారు. అఫిషియల్‌గా వీళ్ళు మా నాయకులంటూ జనసేన పార్టీ తరపున ఇంతవరకు ఎవరూ లేరు. కానీ తమకు తాముగా నాయకులమంటూ చెప్పుకుంటూ అప్పుడే తన్నులాటలు మొదలుపెట్టారు. తిరుపతిలో జనసేన పార్టీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి.


ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ అసోసియేసన్ అధ్యక్షుడిగా ఉన్న కిరణ్ రాయల్‌కు, పసుపులేటి హరిప్రసాద్ అనుచరుడిగా ఉన్న సురేష్‌కు మధ్య వివాదం నెలకొంది. ఇది చినికిచినికి గాలివానలా మారి చివరకు పంచాయతీ పవన్ కళ్యాణ్‌ వద్దకు చేరింది. తిరుపతి జనసేన పార్టీ నేతల మధ్య నెలకొన్న విబేధాలకు కారణాలు ఏంటి. 
 
జనసేన పార్టీ. జనం కోసమే పుట్టిందంటూ ప్రజల్లో హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్‌ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు. పార్ట్ టైం పొలిటీషియన్‌గా విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్‌ తరువాత కాలంలో పూర్తిస్థాయి ప్రజల్లోకి వచ్చాడు. బస్సు యాత్ర ద్వారా ఉత్తరాంధ్రలో ముమ్మరంగా పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడు. అయితే మరోవైపు పార్టీలో విభేదాలు పుట్టుకొస్తున్నాయి. తిరుపతి కేంద్రంగా జనసేన పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. పార్టీ సీనియర్లుగా ఉన్న నాయకులకు, ఫ్యాన్స్‌కు మధ్య అగాధం ఏర్పడింది. 
 
పవన్ కళ్యాణ్‌ రైట్ హ్యాండ్‌గా చెప్పబడే పసుపులేటి హరిప్రసాద్‌కు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న కిరణ్‌ రాయల్‌కు మధ్య గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. పసుపులేటి ఆధిపత్యాన్ని కిరణ్ రాయల్ తనదైన రీతిలో ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఇది చివరకు చినికిచినికి గాలివానలా మారి వ్యక్తిగతంగా దాడులు చేసుకునే స్థాయికి చేరింది. హరిప్రసాద్‌కు ప్రధాన అనుచరుడిగా భావించే సురేష్‌‌ను మాట్లాడడానికి పిలిచి దాడి చేశారు కిరణ్‌ రాయల్ వర్గం.

దీంతో పార్టీ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. అధిష్టానం దగ్గరే ఈ విషయాన్ని అమీతుమీ తేల్చుకోవడం కోసం సిద్థమైన పసుపులేటి సురేష్‌ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌‌ను కలవడానికి వెళ్ళారు. ఇప్పటివరకు ప్రతిపక్ష, అధికార పార్టీలు చేస్తున్న తప్పులను ఎత్తిచూపడంలో ఆవేశం ప్రదర్శిస్తున్న పవన్ కళ్యాణ్‌ తన పార్టీలోని అంతర్గత విభేదాలను ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.