1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 3 డిశెంబరు 2021 (16:02 IST)

బాల‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన సప్తగిరులు

ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ, తిరుమ‌ల‌ నాద నీరాజ‌నం వేదిక‌పై అంద‌రినీ అల‌రించాయి. శుక్రవారం ఉద‌యం 9 నుండి 11 గంటల వరకు జరిగిన బాల‌కాండలోని 14 నుండి 17వ‌ సర్గ వ‌ర‌కు ఉన్న మొత్తం 157 శ్లోకాలను వేద పండితులు పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంతో సప్తగిరులు మార్మోగాయి.
 
 
బాల‌కాండ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆధ్యాప‌కులు ఆచార్య ప్ర‌వా రామ‌కృష్ణ సోమ‌యాజులు మాట్లాడుతూ, ‌మ‌న పూర్వీకులు అందించిన దివ్య శ‌క్తి మంత్రోచ్ఛ‌ర‌ణ అని, దీనితో స‌మ‌స్త రోగాల‌ను న‌యం చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. కొన్ని వంద‌ల‌ సంవ‌త్స‌రాలుగా మాన‌వులు రామాయ‌ణం విన్న, పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న బాధ‌లు తొల‌గి, సుఖ సంతోషాల‌తో ఉన్న‌ట్లు పురాణాల ద్వారా నిరూపిత‌మైన‌ద‌న్నారు. వాల్మీకి మ‌హ‌ర్షి శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిని ఆశ్ర‌యించిన‌ట్లు, యావ‌త్ ప్ర‌పంచం రామనామం పలికితే స‌క‌ల శుభాలు సిద్ధిస్తాయ‌న్నారు. ప్ర‌పంచ శాంతి, క‌రోనా మూడ‌వ వేవ్ నుండి పిల్ల‌లు, పెద్ద‌లు అన్ని వర్గాలవారు సుఖ‌శాంతుల‌తో ఉండాల‌ని బాల‌కాండ పారాయ‌ణం నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. బాల‌కాండలోని శ్లోకాలను, విషూచికా మ‌హ‌మ్మారి నివార‌ణ మంత్రమును ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఒకేసారి పారాయ‌ణం చేస్తే ఫ‌లితం అనంతంగా ఉంటుంద‌ని వివ‌రించారు.
 
 
అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.
 
 
ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌ వేంకట కృష్ణ బృందం " రాముడుద్భవించినాడు రఘుకులాంబున ", అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ప్రారంభంలో, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు రాజమోహన్, ఉదయ భాస్కర్, బాలాజీ బృందం"  రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా" అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ముగింపులో సుమ‌ధురంగా అల‌పించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు మోహ‌నరంగా చార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.