శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (11:32 IST)

ఆరడుగుల శిరీషను ఇద్దరు లొంగదీసుకోవడమా? షర్ట్ బటన్‌లు అలా వున్నాయి..

ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీషను ఒక్కరో లేక ఇద్దరో ఏమీ చేయలేరని ఆమె పిన్ని ఆరోపించారు. ఆరు అడుగుల ఆమె ఫ్యాన్ కు వేలాడితే ఫ్యాన్ రెక్కలు కనీసం వంగవా? అని ఆమె ప్రశ్నించారు. అలాగే

ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీషను ఒక్కరో లేక ఇద్దరో ఏమీ చేయలేరని ఆమె పిన్ని ఆరోపించారు. ఆరు అడుగుల ఆమె ఫ్యాన్ కు వేలాడితే ఫ్యాన్ రెక్కలు కనీసం వంగవా? అని ఆమె ప్రశ్నించారు. అలాగే ఫ్యాంటు షర్టు వేసుకున్న శిరీష దగ్గరకి చున్నీ ఎలా వచ్చిందని ఆమె నిలదీశారు. శిరీషను హత్య చేశారని ఎవరికైనా అర్థమవుతుందన్నారు. 
 
శిరీషను రాజీవ్, శ్రవణ్‌లు మాత్రమే చంపలేదని ఆమె పిన్ని ఆరోపించారు. ఆరు అడుగుల పొడవైన శిరీషను ఒక్కరో లేక ఇద్దరో లోంగదీసుకోవడం అయ్యేపని కాదని పిన్ని తెలిపారు. శిరీష హత్యలో ముగ్గురో లేక నలుగురి ప్రమేయం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. శిరీష ఆత్మహత్య ఘటన అనంతరం శిరీష హ్యాండ్ బ్యాగ్ ను ఆమె భర్త పోలీసులకు ఇచ్చాడని, అయితే కారులో ఉన్న మరొకరి హ్యాండ్ బ్యాగ్ ఎవరిదని ఆమె అడిగారు. ఈ కేసులో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని నిర్ధారించేందుకు ఇంతకంటే సాక్ష్యంగా ఏం కావాలని శిరీష ప్రశ్నించింది. 
 
శిరీషను హత్య చేశారని ఆమె మేనమామ కూడా ఆరోపించారు. తన మేనకోడలిపై తప్పుడు ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. తన మేనకోడలిని కారులో తీసుకొచ్చేటప్పుడే హతమార్చారని, మెడకు వైరు బిగించి ఆమెను హత్య చేశారని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆమె మెడపై వైరు చారిక ఉందన్నారు. అంతేకాకుండా మీడియా చూపిస్తున్న ఫోటోలలో ఆమె షర్టు బటన్ గుండీలు అపక్రమంలో పెట్టినట్టున్నాయని, కావాలంటే చూడాలని ఆయన సూచించారు. కింది బటన్‌ను పై బొత్తంలో పెట్టారని, కావాలంటే మీడియా చూపిస్తున్న ఫోటోలలో సరిచూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. శిరీషది హత్యేనని తెలిపారు.