ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (08:00 IST)

వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న లబ్ధిదారులకు వచ్చే నెలలో పింఛన్‌

లాక్‌డౌన్‌ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఈ నెల పింఛన్ తీసుకోలేకపోయిన వారికి శుభవార్త! ఈ నెల పింఛన్ తీసుకోలేకపోయామే అని బాధ పడాల్సిన పనిలేదు.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఏప్రిల్‌ 1, 2, 3 తేదీల్లో పింఛన్‌ తీసుకోలేకపోయిన వారికి వచ్చే నెలలో రెండు నెలల పింఛన్‌ ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టత ఇచ్చారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. ఈ నెలలో పింఛన్‌ తీసుకోలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అలాంటి వారికి మే నెలలో రెండు నెలల పింఛన్‌ కలిపి ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు.