శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2024 (08:26 IST)

తన పోలికలతో ఒక బాబు కావాలి.. కోడలిపై మామ ఒత్తిడి.. కుమారుడు వత్తాసు!!

Podicheti Seetharamanuja Charyulu
తమకు ఆస్తులు బాగా ఉన్నాయని, అందువల్ల తన పోలికలతో ఒక బాబు కావాలంటూ కోడలిపై సొంత మామ ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురిచేశాడు. ఈ విషయాన్ని కట్టుకున్న భర్తకు బాధితురాలు కన్నీటితో చెప్పుకోగా, ఆయన తండ్రికే వత్తాసు పలికాడు. పైగా, భార్యతో తన తండ్రికి క్షమాపణలు చెప్పించాడు. ఆ తర్వాత ఆ కామాంధుడు మరింతగా రెచ్చిపోయాడు. ఆయన ఎవరో కాదు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు. ఆయనకు వత్తాసు పలికింది దత్తపుత్రుడు సీతారాం. వీరిద్దరిపై బాధితురాలు ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడుగా పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఆయన దత్తపుత్రుడు, ఆలయ అర్చకుడైన పొడిచేటి తిరుమల వెంకట సీతారాంలు పని చేస్తున్నారు. వీరిద్దరు ఇపుడు సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆలయన ఈవో రమాదేవి బుధవారం సాయంత్రం ప్రకటించారు. సీతారామానుజాచార్యులు కోడలు, వెంకట సీతారాం భార్య... వీరిద్దరిపై వరకట్నం, లైంగిక వేధింపుల అభియోగాలతో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆ కేసు వివరాలను అర్చకులిద్దరూ దాచిపెట్టడంతో దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశం మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
బాధితురాలి ఫిర్యాదులో పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే, సీతారామానుజాచార్యులుకు కుమార్తెలు ఉన్నారు. కుమారులు కలగలేదు. ఆయన తనకు తెలిసిన కుటుంబానికి చెందిన సీతారాంను కొన్నేళ్ల కిందట దత్తత తీసుకున్నారు. సీతారాం వివాహం తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన యువతితో 2019లో జరిగింది. కొన్ని నెలలకే సీతారాం భార్యకు వేధింపులు మొదలయ్యాయి. అత్త, ఆడపడుచులు, వారి కుటుంబ సభ్యులు రూ.10 లక్షల వరకట్నం తేవాలని వేధించేవారు. 
 
ఈ క్రమంలో మామ సీతారామానుజాచార్యులు ఆమెపై లైంగిక వేధింపులు ఆరంభించాడు. బాధితురాలు తన భర్తకు గోడు వెళ్లబోసుకోగా... అతనూ తన తండ్రికే అనుకూలంగా మాట్లాడి... భార్యతోనే తండ్రికి క్షమాపణ చెప్పించాడు. ఆ తర్వాత నుంచి సీతారామానుజాచార్యులు మరింత రెచ్చిపోయి తనకు ఆస్తులు బాగా ఉన్నాయని.. తన పోలికలతో ఒక బాబు కావాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. దీంతో బాధితురాలు ఆగస్టులో తాడేపల్లిగూడెం పోలీసులను ఆశ్రయించడంతో అదే నెల 14వ తేదీన కేసు నమోదైంది. దీంతో తండ్రీకొడుకులను దేవాదాయశాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు.