1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జనవరి 2024 (08:39 IST)

రామ్ లల్లా విగ్రహం ఫోటోలు లీక్ కావడంపై విచారణ జరిపించాలి : సత్యేంద్ర దాస్

Ram Lalla
రామ్ లల్లా విగ్రహం ఫోటోలు లీక్ కావడంతో విచారణ జరిపించాలని అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. ప్రాణప్రతిష్టకు ముందే ఫోటోలు లీక్ కావడంతో ఆయన మండిపడ్డారు. తాము ఎలాంటి ఫోటోలు విడుదల చేయలేదని ఆలయ ట్రస్ట్ ఆఫీస్ బేరర్లు, విశ్వ హిందూ పరిషత్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. 
 
ఈ ఫోటోలు లీక్ కావడంపై సత్యేంద్ర దాస్ స్పందిస్తూ, కళ్లను కప్పి ఉంచని ఫోటోలు లీక్ కావడంపై విచారణ జరిపించాలని కోరారు. ఆలయ గర్భగుడిలో విగ్రహంకళ్లను వస్త్రంతో కప్పివున్న మొదటి ఫోటోను గురువారం విడుదల చేశారు. అయితే, మరుసటి రోజే కళ్లను కప్పివుంచని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ విధంగా ప్రాణప్రతిష్టకు ముందే ఫోటోలు లీక్ కావడంపై ఆయన మండిపడ్డారు. 
 
ప్రాణప్రతిష్ట పూర్తికాకముందే రాముడి విగ్రహం కళ్లను బయటకు తెలియజేయనివ్వలేమని సత్యేంద్ర దాస్ అన్నారు. ఆ ఫోటోలను ఎవరు లీక్ చేశారో, ఎలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో విచారణ జరగాలని ఆయన కోరారు. కాగా, ప్రాణప్రతిష్టకు ముందు అయోధ్య రామాలయంలో ప్రతిష్టంచనున్న రామ్ లల్లా విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెల్సిందే.