ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2024 (17:53 IST)

Big Boost For Amaravati అమరావతి నిర్మాణం : తొలి దశలో చేపట్టే పనులు ఇవే...

amaravati
Big Boost For Amaravati ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్డీయే పరిధిలో 20 పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సివిల్ నిర్మాణ పనులకు రూ.11,467 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
కేంద్ర సహకారంతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణాలతో ఈ పనులు చేపడుతున్నారు. ఈ నిధులతో మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారుల, జడ్జిల నివాసాలు, ప్రభుత్వ ఉద్యోగుల గృహాలు, సెక్రటేరియట్ టవర్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశారు. 
 
ఇక రాజధాని ప్రాంతంలోని కొండవీటి వాగు, పాలవాగులను వెడల్పు చేసేందుకు కూడా నిధులు కేటాయించారు. శాఖమూరు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.1585 కోట్లు కేటాయించారు. హ్యాపీ నెస్ట్ అపార్టుమెంట్ల నిర్మాణం కోసం రూ.984 కోట్లు మంజూరు చేశారు. 
 
ఇకపోతే, వర్ష, వరదనీటి కాల్వల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థలు సీనరేజ్, యుటిలిటీ డక్ట్స్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కోసం కూడా నిధులను మంజూరు చేశారు.