ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (16:44 IST)

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా? లేదా? సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

laddu
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పంది నెయ్యిని ఉపయోగించారా లేదా అన్నది ఇపుడు తేలాల్సిన విషయమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించరా, ప్రభుత్వ హయాంలోనే ఇదంతా జరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ కల్తీ జరిగిన నెయ్యిని వెనక్కి పంపించినట్టు మరోవాదన ఉంది. దీంతో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించారా లేదా అన్నిది తేలాల్సిన విషయమన్నారు. 
 
తితిదే పూర్వ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామిలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది.  లడ్టూ తయారీకి ఉయోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు అనుమానాలు రావడంతో అధికారులు తనిఖీ చేసి, నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ ఫుడ్స్‌కు చెందిన ట్యాంకర్లను పరీక్షకు పంపారని టీటీడీ తరపు న్యాయవాది వెల్లడించారు. ఆ రిపోర్టు ఆధారంగానే, లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు నిర్ధారణకు వచ్చారని తెలిపారు.
 
దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ... కేవలం ఒక్క ల్యాబ్‌లోనేకాకుండా... ఘజియాబాద్, మైసూర్‌లలో ఉన్న ల్యాబ్‌లలో నెయ్యి శాంపిల్స్‌ను ఎందుకు పరీక్ష చేయించలేదు? దర్యాప్తు పూర్తి కాకుండానే కల్తీ జరిగిందని ఎలా చెబుతారు? అని ప్రశ్నించింది. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహరామని పేర్కొంది. జూన్, జూలై నెలలో ఎన్ని ట్యాంకర్లు వాడారనే వివరాలను తితిదే తరపు న్యాయవాది కోర్టకు తెలిపారు. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటి, రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ, తదుపరి విచారణను అక్టోబరు మూడో తేదీకి వాయిదా వేసింది.