గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated : సోమవారం, 5 జులై 2021 (19:33 IST)

చిలకం రామచంద్రారెడ్డికి సోము వీర్రాజు నివాళి

Somu veeraju
భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు  బీజేపీ మాజీ  అధ్య‌క్షుడు చిల‌కం రామ‌చంద్రారెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చిత్తూరు జిల్లాలోని మంగళం గ్రామానికి విచ్చేసి, పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు చిలకం రామచంద్రా రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఆయన బీజేపీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాయలసీ శాంతి. 
 
సాగునీటి కోసం 40 రోజుల పాటు రామచంద్రారెడ్డి చేసిన పాదయాత్ర ప్రజల్లో చైతన్యం తెచ్చిందన్నారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఎప్పటికీ కార్యకర్తలు, ప్రజల హృదయాల్లో నిలిచివుంటారని పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి ఆశయాలు, జీవితం, వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకుని నడుచుకుంటామని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు. 
 
సోమువీర్రాజుతో కలిసి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్నయుడు. అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్. ఆనందకుమార్ కోలా, నిషితరాజ్, జిల్లా అధ్యక్షులు ఎం.రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.