సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 1 జనవరి 2022 (14:39 IST)

దేశ ద్రోహి మ‌హ్మ‌ద్ ఆలీ జిన్నా... గుంటూరు ట‌వ‌ర్ పేరు మార్చాల్సిందే!

గుంటూరులోని జిన్నా ట‌వ‌ర్ పై ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌ల‌ను బీజేపీ నేత‌లంతా బ‌ల‌ప‌రుస్తున్నారు. ఆయ‌న మ‌ద్యం ధ‌ర‌ల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌తోపాటు, జిన్నా ట‌వ‌ర్ పైన చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా అంతా సమ‌ర్ధిస్తునే ఉన్నారు. 
 
 
గుంటూరులోని టవర్‌కు జిన్నా పేరు పెట్టడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా ఆయ‌న స్పందిస్తూ, దేశ ద్రోహి ఆలీ జిన్నా పేరు గుంటూరులో టవర్‌కు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎక్కడో పాకిస్తాన్‌లో ఉండాల్సిన పేరు ఇక్కడ పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. ఆ టవర్‌కు భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ కలామ్ పేరు, లేదా గుర్రం జాషువా పేరు పెట్టాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు.
 
 
గుంటూరులో దేశ ద్రోహి జిన్నా పేరిట ఉన్న సెంటర్ విషయంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యల్లో ఏ వివాదం లేదని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానన్నారు. జిన్నా సెంటర్ పేరును మార్చకపోతే, దాన్ని తామే కూలుస్తామన్నారు. తాము ఆ పేరు త‌ప్ప‌క మార్చుతామని, దేశ రాజధానిలోని ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చామని అన్నారు. రాష్ట్రంలోని ఓ న‌గ‌రంలోని ట‌వ‌ర్ పేరు మార్చలేమా అని విష్ణువర్దన్‌రెడ్డి ప్ర‌శ్నించారు.