సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 11 ఆగస్టు 2019 (23:03 IST)

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు రెండేళ్ళ ప్రస్థానంపై పుస్తకం

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు  రెండేళ్ళ ప్రస్థానంపై లిజనింగ్, లెర్నింగ్ అండ్ లీడింగ్ పేరిట సమచార ప్రసార మంత్రిత్వ శాఖ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా  చెన్నైలో  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయడు మాట్లాడుతూ ప్రజా జీవితంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు మరింత దగ్గరగా ఉన్నానని, ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానని, అదే ప్రజలకు తనను మరింత చేరువ చేసిందని ఉపరాష్ట్రపతి తెలిపారు. 
 
సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు ఢిల్లీలో నిర్వహిస్తుంటారని అయితే, దేశమంతా ఒక్కటే అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చెన్నైలో ఏర్పాటు చేయమన్నానని తెలిపారు. రాజకీయాల్లో కొనసాగుతూనే 2020 తర్వాత నానాజీ దేశ్ ముఖ్ బాటలో సామాజికలో సేవలో గడుపుదామనుకున్నానని, ఈ విషయాన్ని శ్రీ మోదీజీకి చాలా సార్లు తెలిపానని, అయితే ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాలని మాత్రం ఏ రోజూ అనుకోలేదని, ఇది అనూహ్యంగానే జరిగిందని తెలిపారు. 
 
ఉపరాష్ట్రపతి ఏడాది ప్రస్థానాన్నికి సంబంధించి మూవింగ్ ఆన్ – మూవింగ్ ఫార్వర్డ్ పేరిట సచిత్ర గ్రంథాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గతేడాది విడుదల చేసిన విషయం విదితమే.. రెండేళ్ళలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొన్న 330 కీలకమైన కార్యక్రమాల విశేషాలతో ఈ పుస్తకాన్ని రూపు దిద్దారు. విశాల భారతంలో విస్తారంగా పర్యటించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు రెండేళ్ళలో 61 స్నాతకోత్సవాల్లో ప్రసంగించారు, 35 కార్యక్రమాల్లో విద్యార్థులతో సమావేశమయ్యారు, 97 శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థలను సందర్శించారు.