సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (13:30 IST)

భార్యపై తమ్ముళ్లచే అత్యాచారం.. భర్తే ఆ పని చేయించాడు..

భర్త సమక్షంలోనే అతని ముగ్గురు సోదరులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. వారిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులను ఆదేశించడంతో కేసు నమోదు చేశారు. 
 
వివరాల ప్రకారం... బోరబండ ఇంద్రానగర్‌లో నివాసముంటున్న నర్సింహ మద్యానికి అలవాటు పడ్డాడు. భార్యను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. దీంతోపాటు తన సోదరులతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు.
 
మరుదులైన కృష్ణ, శ్రీనివాస్, మునీందర్‌లు కూడా ఆమెను వేధించారు. 2017లో భార్యను నిర్భందించి సోదరుల చేత లైంగిక దాడికి సహకరించాడు. బాధితురాలు కోర్టును ఆశ్రయించగా మంగళవారం కేసు నమోదు చేశామన్నారు.