గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (12:56 IST)

ల‌క్ కోసం ఎదురుచూస్తున్న మ‌న్నారా

Mannara chopra
మన్నారా చోప్రా న‌టిగా ఏడు సినిమాలు చేసింది. 2014లో ప్రేమ గీమా జాంతానై అనే తెలుగు సినిమా ద్వారా ఎంట‌ర‌యింది. ప్రియాంక చోప్రాకు వరుసకు చెల్లెలు. ఆమె పేరుమీదు కొన్ని అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే ఆమె చేసిన సినిమాలు పెద్ద‌గా ఆద‌ర‌ణ చూర‌గొన‌లేదు. సునీల్‌తో జ‌క్క‌న్న న‌టించినా లాభంలేక‌పోయింది. కాజ‌ల్ అసిస్టెంట్‌గా సీత సినిమాలో న‌టించింది. 2019లో ఆ సినిమా విడుద‌లై పెద్ద‌గా ఆడ‌లేదు. అయితే ఇప్పుడు మ‌ర‌లా లీడ్‌రోల్ కాకుండా ప్ర‌ధాన‌మైన పాత్ర‌లో న‌టించ‌డానికి ముందుకు వ‌స్తోంది. తాజాగా ఇన సోష‌ల్‌మీడియాలో ఫొటోలు పెట్టింది. ద‌క్షిణాదిలో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతోంది. అందం, అభిన‌యంతోపాటు ల‌క్ కూడా వుండాల‌ని అంటోంది. ఈ బ్యూటీ మంచి హిట్ ఎప్పుడు అందుకుంటుందో వేచి చూడాల్సిందే.