గుంటూరు జీజీహెచ్ లో మూడు రోజుల మగ శిశువు అపహరణ కలకలం
గుంటూరు జీజీహెచ్ లో మూడు రోజుల మగ శిశువు అపహరణ కలకలం రేపింది. ఈ నెల 12న ఆసుపత్రిలో కాన్పు కోసం పెదకాకానికి చెందిన ప్రియాంక అనే మహిళ చేరింది. ఆమె 13న మగ శిశువుకు జన్మనిచ్చింది. రాత్రి చిన్నారి ఏడుస్తుండడంతో బయటకు తీసుకొచ్చిన నాయనమ్మ...తర్వాత శిశువు అపహరణ అయినట్లు చెపుతోంది.
బాత్రూంకు వెళుతూ, నిద్రపోతున్న అమ్మమ్మ పార్వతమ్మ పక్కన శిశువును పెట్టినట్లు నాయనమ్మ తెలిపింది. ఆ తర్వాత ఐదు నిమిషాల్లోనే శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు బంధువులు చెపుతున్నారు. కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు తమకు ఆసుపత్రిలోని ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు చెపుతున్నారు. కొత్తపేట పోలీసులు
సీసీ ఫుటేజ్ లను పరివేక్షిస్తున్నారు.