గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (11:54 IST)

కడప జిల్లాలో బ్రిటిషర్ల కాలం నాటి రిజర్వాయర్

బ్రిటిషర్ల కాలం నాటి రిజర్వాయర్ కడప జిల్లాలో  బయటపడింది. కడప ప్రజల మంచినీటి అవసరాలు తీర్చేందుకు బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో 1890లో సంప్‌లా దీనిని నిర్మించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకం కూడా కనిపించింది. ఇన్నాళ్లు మరుగున పడిపోయిన ఆ రిజర్వాయర్ ప్రస్తుతంవెలుగులోకి వచ్చింది. 
 
నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చింతకొమ్మదిన్నె మండలం బుగ్గవంక సమీపంలోని బుగ్గ అగ్రహారంలో దీనిని గుర్తించారు. పొలాల మధ్యలో ఉన్న దీనిపై రెండు అడుగుల వెడల్పుతో 8 రంధ్రాలున్నాయి. దీంతో లోపలికి దిగి పరిశీలించగా 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో నాలుగు భాగాలుగా ఉంది