గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (13:48 IST)

నరసారావు పేటలో వ్యక్తి దారుణ హత్య.. కల్యాణ్‌ జ్యువెలరీలో పనిచేసే?

crime scene
నరసారావు పేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఈ హత్యకు గురైంది కల్యాణ్‌ జ్యువెలరీ దుకాణంలో పనిచేసే రామాంజనేయులుగా గుర్తించారు. 
 
భర్త అపహరణపై నిన్న పోలీసులకు రామాంజనేయులు భార్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ నేపథ్యంలోనే రామాంజనేయులు కిడ్నాప్, హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద హత్యకు గురైన రామాంజనేయులు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
రామాంజనేయులును తీవ్రంగా కొట్టి కాల్వలో వేసి కాళ్ళతో తొక్కి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.