బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (18:01 IST)

గ్రేటర్ పల్నాడు లేదా మహా పల్నాడుగా పేరు పెట్టండి?

ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో… నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసే జిల్లాకు గ్రేటర్ పల్నాడు లేదా మహా పల్నాడు జిల్లాగా పేరు పెట్టాలని లేఖలో కోరారు.

పార్లమెంట్ నియోజకవర్గాల తరహాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. గొప్ప చరిత్ర, సంప్రదాయం కలిగిన పల్నాడు ప్రాంతానికి నరసరావుపేట ముఖ ద్వారం కాబట్టి మహా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని జీవీఎల్ కోరారు.