గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 22 సెప్టెంబరు 2021 (13:42 IST)

ఎగ్ దోసెకి డబ్బులివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

చిత్తూరుజిల్లా చంద్రగిరి నియోజవకర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ తలారివారిపల్లికి సాయికిరణ్‌  స్థానికంగా ఉన్న గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. 
 
సాయికిరణ్ బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న వేము ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. స్నేహితులతో కలిసి ప్రతిరోజు ఉదయం బయట టిఫిన్ చేసేవాడు సాయికిరణ్.
 
అయితే హోటల్ ఫుడ్ తినొద్దని, ఇంటిలో చేసే టిఫిన్ తినమని తల్లిదండ్రులు పదేపదే చెప్పినా వినిపించుకునేవాడు కాదు సాయికిరణ్. హోటల్ తిండి తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని హెచ్చరించారు కూడా. కానీ సాయికిరణ్ మారలేదు.
 
ఈరోజు ఉదయం కూడా తను ఎగ్ దోసి తినాలని.. డబ్బులు ఇవ్వాలని కోరాడు. తల్లిదండ్రులు ఇందుకు ససేమిరా అన్నారు. దీంతో మనస్థాపానికి గురైన సాయికిరణ్ ఇంటికి సమీపంలో ఉన్న కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.