మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:46 IST)

దీక్షకు తీసుకొచ్చి డబ్బులివ్వట్లేదు.. కిరాయి కూలీల ఆందోళన

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిల తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పార్టీని స్థాపించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఆమె రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో అడ్డాకూలీలు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టనున్న దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బు ఇవ్వట్లేదని అడ్డాకూలీలు నిరసన తెలిపారు. 
 
తమను తీసుకొచ్చిన వారు డబ్బు ఇవ్వట్లేదని దీక్షా స్థలి వద్దే ఆందోళన చేశారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని కూలీలు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ పీర్జాదిగూడలో షర్మిల చేపట్టబోయే నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.