గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (15:17 IST)

పప్పు కూతలు కూసే కొడాలి నాని.. జగన్ ఓ గన్నేరు పప్పు : బుద్ధా వెంకన్న

ఏపీ మంత్రి కొడాలి నానికి టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పప్పు కూతలు కూసే కొడాలి నాని మీ నాయకుడు జగన్ ఓ గన్నేరు పప్పు అనే విషయం తెలుసుకో, విశ్వాసం లేని నాని లాంటి కుక్కలను చంద్రబాబు పెంచి పోషించారని గుర్తుచేశారు. 
 
టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, కొడాలి నాని వంటి నీచమైన వ్యక్తులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. 1999 గుడివాడలో హరికృష్ణ నాలుగో స్థానంలో పడేసిన కుట్ర చేశావు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే కొడాలి నాని వారి కుటుంబ సభ్యులను సిగ్గు లేకుండా తిడతాడు. వీరులు పుట్టిన గడ్డలో కొడాలి నాని వంటి సన్నాసులు ఎలా ఉంటారు, గుండీలు విప్పి రంకెలేస్తే నాయుకుడివి అయిపోతావా అంటూ ఆయన నిలదీశారు. 
 
చంద్రబాబు, జగన్‌లలో ఎవరు వెన్నుపోటుదారులో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సొంత బాబాయిని ఒక్క గొడ్డలివేటుతో ఈ లోకంలోనే లేకుండా చేసి నిజమైన వెన్నుపోటుదారులు ఎవరో ప్రజలు బాగా తెలిసిందన్నారు.