శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (20:02 IST)

ఏ చట్టప్రకారం చంద్రబాబు కాన్వాయ్ ను ఆపారు?: పరుచూరి అశోక్ బాబు

రామతీర్థం ఘటనలో ప్రభుత్వదిగజారుడుతనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని, పాలకుల దాష్టీకాలు, దౌర్జన్యాలను ప్రజల గమనిస్తున్నారని, రామతీర్థం వెళుతున్న చంద్రబాబు వాహన శ్రేణిని అడ్డుకోవడం, ఆయనవెంట వెళుతున్నటీడీపీనేతల వాహనాలను అడ్డగించడంద్వారా ప్రభుత్వంలో  భయం మొదలైందని అర్థమవుతోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పష్టంచేశారు.

శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విజయసాయి రెడ్డికి భద్రతకల్పించి మరీ రామతీర్థంకొండపైకి అనుమతించిన పోలీసులు, ప్రభుత్వం చంద్రబాబునాయుడిని అడ్డుకోవడమేంటని అశోక్ బాబు ప్రశ్నించారు. విజయసాయిరెడ్డికి ఇచ్చిన గౌరవం కూడా మాజీముఖ్యమంత్రికి ఇవ్వరా అన్నారు. ఈ రకమైన దౌర్జన్యాలు, రౌడీయిజాలు చేస్తే, వైసీపీనేతలెవరూ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉండదని అశోక్ బాబు తేల్చిచెప్పారు.

ముఖ్యమంత్రికూడా తాడేపల్లి దాటి బయటకు రాలేని పరిస్థితులు కల్పిస్తామని ఆయన తీవ్రస్వరంతో హెచ్చరించారు.  రైతులశిబిరాలకు పరదాలుకట్టి, సచివాలయానికి వెళుతున్న ముఖ్యమంత్రికి అదే పరిస్థితి రాష్ట్రమంతా వచ్చేలా చేస్తామన్నారు. మాజీముఖ్యమంత్రి వెంట వెళుతున్న కాన్వాయ్ వెంట వెళుతున్న వాహనాలను అడ్డుకోవడం ఏమిటన్నారు?

డీజీపీ వైసీపీకార్యకర్తలా పనిచేస్తున్నా డని, ఆయన తనపద్ధతి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించు కోక తప్పదని టీడీపీనేత మండిపడ్డారు. జడ్ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తి పర్యటనలో ఒక్క వాహనాన్ని మాత్రమే అనుమతించ డం ఏమిటని, అలా అని ఏచట్టంలో ఉందో చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ వారు దౌర్జన్యాలతో భయపెట్టాలని చూస్తే భయపడేవారెవరూ లేరన్నారు.

భాధ్యతగలప్రతిపక్షనేత కాన్వాయ్ ను, అడ్డుకున్న  పోలీసులకు అసలు బుద్ధుందా అన్న టీడీపీనేత, ఒక్కవాహనాన్ని మాత్రమే రామతీర్థానికి అనుమతించడం ఏమిటన్నారు. పోలీసులు ఖాకీ దుస్తులు వేసుకొంది ప్రజలకోసమని తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు శాశ్వతంకాదనే నిజాన్ని పోలీసులు తెలుసుకోవాలని,  ముఖ్యమంత్రుల మోచేతి నీళ్లు తాగడం అనేది ఎల్లకాలం సాగదన్నారు.

డీజీపీ హైకోర్టుకి వెళ్లి క్షమాపణచెప్పుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని, అందుకు ఆయన సిగ్గుపడాలన్నారు. అంతటి భయమే ప్రభుత్వానికి ఉంటే, ప్రతిపక్షనేత చంద్రబాబుని రామతీర్థం వెళ్లకుండా అడ్డుకోవాల్సిందన్నారు. పోలీసులు తాము ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని గుర్తెరిగి మసులుకుంటే మంచిదన్నారు. టీడీపీశ్రేణులను హింసిస్తూ, వారిపై తప్పుడు కేసులు పెట్టినంతమాత్రానా ప్రతిపక్షపార్టీవారు వెనక్కతగ్గరని అశోక్ బాబు తేల్చిచెప్పారు.

పోలీసులు రాజకీయనేతల మోకాళ్లదగ్గర పడి  పనిచేయడం మానేసి, సక్రమంగా పనిచేయాలన్నారు. చంద్రబాబు నాయుడుని రోడ్డుపై నిలుచోబెట్టిన తీరుని రాష్ట్రమంతా చూశారని, పోలీసులు తమప్రవర్తన మార్చుకోకుంటే డీజీపీకూడా తన కార్యాలయానికి వెళ్లలేరని టీడీపీనేత తేల్చిచెప్పారు. పరిస్థితి అక్కడివరకు తెచ్చుకోకుండా డీజీపీ పనిచేస్తే, ఆయనకే మంచిదన్నారు. 

చంద్రబాబునాయుడి వెంటవెళుతున్న టీడీపీనేతల వాహానాలను అడ్డుకోవడంతోపాటు, జడ్ కేటగిరీలో ఉన్న ఆరు, ఏడు వాహనాలను అడ్డుకోవడం ఏమిటన్నారు. జడ్ కేటగిరి భద్రతలో ఉన్న వ్యక్తికి ఉన్న వాహనశ్రేణి మొత్తం ఆయన వెంటే పంపిచాల్సిఉండగా పోలీసులు ఎందుకు వాహనాలను అడ్డుకున్నా రని అశోక్ బాబు నిలదీశారు. తనవాహనాలను అనుమతించాల్సిం దేనని చంద్రబాబు ధర్నా చేసేవరకు పోలీసులు ఎందుకు తెచ్చుకున్నారన్నారు. 

పోలీసుల వ్యవహారశైలిపై తాము కోర్టులో కేసు వేస్తే డీజీపీకి న్యాయస్థానంలో దండన తప్పదన్నారు. చట్టాన్ని పరిరక్షించకపోతే, ఆ చట్టమే పోలీసులను భక్షిస్తుందని అశోక్ బాబు స్పష్టంచేశారు. పోలీసులకు నిజంగా చేవ ఉంటే, చేతనైతే, రామతీర్థం ఘటనకు కారకులైన వారిని ఈపాటికే అరెస్ట్ చేసి ఉండేదన్నారు. 

ఉత్తరాంధ్ర చీఫ్ మినిస్టర్ లా విజయసాయి వ్యవహరిస్తుంటే, పోలీసులు, ఆప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనకే ఊడిగం చేస్తున్నారన్నారు. ఏచట్టంప్రకారం ప్రతిపక్షనేత కాన్వాయ్ ను ఆపారో, ఏచట్టంప్రకారం తిరిగి అనుమతించారో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు.