ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 మే 2021 (11:30 IST)

తిరుపతి మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

‘యాస్‌’ తుఫాన్‌ కారణంగా రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. టాటానగర్‌- ఎర్నాకులం(08189)మధ్య నడిచే రైలును 27వ తేదీ, ఎర్నాకులం- టాటానగర్‌(08190)మధ్య నడిచే రైలును  30వతేదీ రద్దు చేశామన్నారు.

ప్రయాణి కుల కొరత కారణంగా మరో నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నామన్నారు. వీటిలో తిరుపతి- చామరాజనగర్‌ (07415) మధ్య నడిచే రైళ్లను బుధవారం నుంచి 31వ తేది వరకు, చామరాజ్‌నగర్‌- తిరుపతి (07416) రైలును 28నుంచి జూన్‌ 2వరకు,నర్సాపురం-ధర్మావరం (07247) రైలును బుధవారం నుంచి 31వరకు, ధర్మావరం- నర్సాపురం (07248) రైలును గురువారం నుంచి జూన్‌ ఒకటో తేది వరకు రద్దు చేస్తున్నట్లు వివరించారు.