గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (15:18 IST)

హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం సింగరాయకొండ పరిధిలో జరిగింది. సింగరాయకొండ పరిధిలోని మూలగుంటపాడు హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ వద్ద సంభవించింది. 
 
సుమారు 50 సంవత్సరాల వయస్సున్న గుర్తుతెలియని మహిళ గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. 
 
సదరు మహిళ స్థానికంగా భిక్షాటన చేస్తుందని, ఆమెకు మతిస్థిమితం ఉండదు అని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.