మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (13:52 IST)

రాముడు ఓ దగుల్బాజీ : కత్తి మహేష్ కామెంట్స్.. కేసు నమోదు

హిందువుల ఆరాధ్య దైవాల్లో ఒకరైన శ్రీరాముడు గురించి అసభ్యంగా మాట్లాడినందుకు సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో హిందూ జనశక్తి నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరక

హిందువుల ఆరాధ్య దైవాల్లో ఒకరైన శ్రీరాముడు గురించి అసభ్యంగా మాట్లాడినందుకు సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో హిందూ జనశక్తి నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు.
 
ఓ టీవీ చానెల్ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో కత్తి మహేష్ మాట్లాడుతూ, 'రామాయణం అనేది నాకొక కథ.. రాముడనేవాడు ఎంత ఆదర్శవంతుడో అంత దగుల్బాజీ అని నేను నమ్ముతా. ఆ కథలో సీత బహుశా రావణుడితోనే ఉంటే బాగుండేదేమో.. న్యాయం జరిగి ఉండేదేమో ఆవిడకి అని నేననుకుంటా' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ వ్యాఖ్యలపై అనేక హిందూ ధార్మిక సంస్థలతో పాటు సంఘ్ పరివార్ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా హిందూ జనశక్తి నేతలు కత్తి మహేష్‌పై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అందులో పేర్కొన్నారు.