సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 11 జూన్ 2018 (17:31 IST)

పడకగది విషయాలు సెల్ ఫోన్‌లో రికార్డు... ఫోన్ పోవడంతో లబోదిబోమంటున్న డాక్టర్..

పడక గదిలో జరిగే విషయాలు నాలుగు గోడలు మధ్యే ఉండాలి.. అంతేకాని ఫోన్ ఉంది కదా అని రికార్డ్ చేసుకుంటే ఎప్పటికైనా ప్రమాదాన్ని తెచ్చే అవకాశాలుంటాయి. వ్యక్తిగతమైన విషయాలు ఇంటికే పరిమితం చేసుకోవాల్సి ఉండగా.. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రమాదాలు కొని తెచ

పడక గదిలో జరిగే విషయాలు నాలుగు గోడలు మధ్యే ఉండాలి.. అంతేకాని ఫోన్ ఉంది కదా అని రికార్డ్ చేసుకుంటే ఎప్పటికైనా ప్రమాదాన్ని తెచ్చే అవకాశాలుంటాయి. వ్యక్తిగతమైన విషయాలు ఇంటికే పరిమితం చేసుకోవాల్సి ఉండగా.. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రమాదాలు  కొని తెచ్చుకుంటున్నారు. 
 
హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు, తన భార్యతో పడక గదిలో శృంగార దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. రికార్డు చేసిన వీడియోలను వెంటనే డిలీట్ చేయకుండా వాటిని ఫోన్‌లో భద్రపరిచాడు. వ్యక్తిగత పనిమీద అతను ముంబైకి వెళ్లాడు. అక్కడ ఫోన్ పోవడంతో సిమ్ బ్లాక్ చేసి, కొత్త సిమ్‌ కార్డ్ తీసుకున్నాడు. కొన్నాళ్లకు అతని వ్యక్తిగతమైన 10 వీడియోలు అశ్లీల వెబ్‌సైట్‌లో హల్చల్ చేయడంతో విషయం తెలిసిన వైద్యుడు ఖంగుతిన్నాడు.  దీంతో సెల్‌ఫోన్ దొంగిలించిన వ్యక్తులే అందులోని వీడియోలను చూసి అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసి ఉంటారని అనుమానించాడు.
 
హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. రెండేళ్లుగా అతని వ్యక్తిగతమైన వీడియోలు ఇంటర్‌నెట్‌లో తిరుగుతున్నాయని గమనించిన పోలీసులు సదరు వీడియోలను వెబ్‌సైట్ నుంచి తొలగించారు. ఇది జరిగి సుమారు సంవత్సరం గడిచింది. తాజగా ఇప్పుడు మరో వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నాయి సదరు వీడియోలు.

మరోమారు డాక్టర్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. ఎక్కడి నుంచి ఈ వీడియోలు అప్‌లోడ్ అయ్యాయోనని ఆరా తీయగా ఢిల్లీ నుంచి అప్‌లోడ్ అయ్యాయని తేలింది. అందుకే అంటారు పెద్దలు పడకగది విషయాలు అక్కడే మర్చిపోవాలని. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇలానే ఉంటుంది మరి.