పోసాని నోటి దూల.. రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో కేసు
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జనసేనాని పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోసానిపై జనసేన కార్యకర్తలు రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జనసేన కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పోసానీపై కేసు నమోదు చేయాల్సిందిగా ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా పోసానికి రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
గత 2022లో కూడా పవన్‌పై పోసాని చేసిన వ్యాఖ్యలకు గాను జనసేన పార్టీ రాజమహేంద్రవరం నేత యందం ఇందిరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇకపోతే.. ఏలూరు వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేశారు. దీంతో పోసాని పవన్ కు కౌంటర్ ఇస్తూ... వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పదంటూ చెప్పుకొచ్చారు. వాలంటీర్లను తిడితే వారి కుటుంబ సభ్యులు బాధపడరా అంటూ ప్రశ్నించారు.
భీమవరంలో పవన్ కల్యాణ్ ఓటమికి టీడీపీనే కారణమని పోసాని ఆరోపించారు. పవన్ చంద్రబాబు గుప్పిట్లో ఉన్నారని పోసాని విమర్శలు చేశారు.
కాపు ఓట్ల కోసం అత్తా కోడలు పవన్‌తో డ్రామా ఆడుతున్నారన్నారు. అత్త కోడలు ఇద్దరు కలిసి పవన్ ను ఐస్ చేశారని భువనేశ్వరి, బ్రాహ్మణిని ఉద్దేశించి మాట్లాడారు.