శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (12:39 IST)

అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసు : మాజీ మంత్రి నారాయణకు ఊరట

narayanap
అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు చేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి.నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు గతంలో హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను మరో రెండు వారాల పాటు పొడగించింది. ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్‌లో ఉన్నారు. ఈ బెయిల్‌ను పొడగించాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. దీంతో మరో రెండు వారాల పాటు బెయిల్ పొడగిస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్ యజమాని బాబి, నారాయణ విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ రెండు వారాల పాటు ముందస్తు బెయిల్ పొడగించింది. జాబితాతో పాటు నారాయణ సంస్థల ఉద్యోగులకు ఆయనకు బినామీలుగా అసైన్డ్ భూములను రైతులను బెదిరించి కొనుగోలు చేశారని ఏపీసీఐడీ పోలీసుల కేసు నమోదు చేశారు. ఆ తర్వాత భూముల విలువ పెరగడంతో వీరు ఆయాచిత లబ్ది పొందారని ఆరోపించారు. ఈ కేసులోనే మాజీ మంత్రి నారాయణకు ఇచ్చిన బెయిల్‌ను మరో రెండు వారాల పాటు పొడగించింది.