గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (11:21 IST)

అమరావతి స్మార్ట్ సిటీకి కేంద్రం షాక్.. నిధుల కేటాయింపునకు నో...

amaravati capital
నవ్యాంధ్ర రాజధాని అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం కేంద్రం రూ.930 కోట్ల నిధులను ఇచ్చినట్టు కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ, అమరావతిలో 930 కోట్ల రూపాయల విలువైన 19 ప్రాజెక్టులను చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో రూ.627.15 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులు పూర్తికాగా, రూ.302.86 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు మొత్తాన్ని ఇప్పటికే ఇచ్చినందున తదుపరి కేటాయింపు ప్రతిపాదనేదీ లేదని స్పష్టంచేసింది. సోమవారం టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి కిశోర్ పై విధంగా సమాధానమిచ్చారు. 
 
విశాఖపట్నంలో స్మార్ట్ సిటీ కింద రూ.942 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టగా, ఇప్పటివరకు రూ.452.25 కోట్లు ఖర్చు చేసినట్టు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. అమృత్ పథకం కింద విజయనగరంలో రూ.46.96 కోట్ల విలువైన పనులు చేపట్టినట్టు వైకాపా ఎంపీ విజయసాయి రె్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇందులో రెండు నీటి సరఫరా ప్రాజెక్టులు, ఒక మురుగు నీటి పారుదల వ్యవస్థ, మూడు పార్కులు ఉన్నాయని, ఇవన్నీ పూర్తయ్యాయని తెలిపారు.