1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (11:04 IST)

హార్డ్ డిస్క్‌లో ఏముందో నాకెలా తెలుసు బాస్ : ఉదయ్ సింహా

ఓటుకు నోటు కేసులో ఆరోపణలెదుర్కొంటూ గత గత రెండు రోజులుగా కనిపంచకుండా పోయిన ఉదయ్‌సింహ స్నేహితుడు రణధీర్ రెడ్డి సోమవారం రాత్రి ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు.

ఓటుకు నోటు కేసులో ఆరోపణలెదుర్కొంటూ గత గత రెండు రోజులుగా కనిపంచకుండా పోయిన ఉదయ్‌సింహ స్నేహితుడు రణధీర్ రెడ్డి సోమవారం రాత్రి ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం రాత్రి ఐటీ అధికారులు తమ ఇంట్లోంచి హార్డ్ డిస్క్ తీసుకువెళ్లారని చెప్పారు. ఆ హార్డ్‌ డిస్క్‌ ఉదయ్‌ సింహదేనని చెప్పారు.
 
అయితే, అందులో ఏముందో తనకు తెలియదన్నారు. 'మూడు నెలల క్రితం ఉదయ్‌సింహ ఇల్లు ఖాళీ  చేసేటప్పుడు నాకు ఆ హార్డ్‌ డిస్క్‌ ఇచ్చారు' అని ఆయన తెలిపారు. విచారణలో భాగంగా అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పానన్న రణధీర్‌.. మూడు రోజుల్లో విచారణకు మళ్లీ రావాలంటూ నోటీసులు ఇచ్చారని తెలిపారు. 
 
కాగా, ఓటుకు నోటు కేసులో టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి ఇంట్లో గత రెండు రోజుల క్రితం ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ సోదాల్లో నగదుతో పాటు. పలు కీలక దస్తావేజులు, బంగారు నగలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న వారి ఇళ్ళలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే, విచారణ కూడా జరుపుతున్నారు.