1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (10:13 IST)

ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటంబాబు అక్కర్లేదు : సీబీఐ మాజీ జేడీ!!

laxminarayana
ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటంబాంబు అక్కర్లేదని, నాసికరకం విద్య, విద్యార్థులను పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం వంటి విధానాలను ప్రోత్సహిస్తే ఆ దేశం తానంటత అదే నాశనం అవుతుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. గత నెలలో జరిగిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకైందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన కీలక ట్వీట్ చేశారు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటం బాంబు అక్కర్లేదని, విద్యార్థులన పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం వంటి విధానాలను ప్రోత్సహిస్తే ఆ దేశం తానంతట అదే నాశనం అవుతుందన్నారు. అలా చదివి డాక్టర్ల చేతిలో రోగులు చనిపోతారు అంటూ పలు ఉదాహరణలను దక్షిణాఫ్రికాలోని ఓ యూనివర్శిటీ ప్రవేశ ద్వారం వద్ద రాశారని ఆయన పేర్కొన్నారు. ఇపుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. 
 
కాగా, జాతీయ స్థాయిలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం బిహార్ రాష్ట్రంలో లీకైంది. ఈ పరీక్షా నిర్వహణ, ఫలితాల వెల్లడిలో జరిగిన అనేక అక్రమాలు, అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నీట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ మొదటి వాదించిన కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఇపుడు మాట మార్చి అక్రమాలు జరిగిన మాట నిజమేనని అంగీకరించారు. నీట్ అక్రమాలు గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో వెలుగు చూడటం అక్కడ ఎన్డీయే కూటమి ప్రభుత్వాలే ఉండటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.