గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2023 (10:17 IST)

రేవంత్ రెడ్డి వారియర్ కింగ్.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్

Ram Gopal Varma
తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంపై సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికరంగా స్పందించాడు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘వారియర్ కింగ్’ అని రామ్‌గోపాల్ వర్మ ప్రశంసించాడు. కొత్త సీఎం రేవంత్ అని తెలియడం చాలా చాలా గర్వంగా ఉందని అభినందించాడు. 
 
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో ఉన్న తన ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేశారు. ఇదిలావుండగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 
 
ఏకంగా 64 స్థానాలను కైవసం చేసుకొని అధికారాన్ని దక్కించుకుంది. ఇక 39 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరనుంది.