గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (19:27 IST)

రేవంత్‌ రెడ్డిని అలా కలవడం విరుద్ధం.. డీజీపీ సస్పెండ్

Revanth reddy
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ శిబిరం సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
 
అయితే, ఫలితాలు వెలువడక ముందే పార్టీ అధ్యక్షుడిని డీజీపీ కలవడం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధమని, దీంతో ఆయనను సస్పెండ్ చేశారని ఈసీ పేర్కొంది.
 
అంతకుముందు డీజీపీ అంజనీకుమార్, తెలంగాణ రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి సంజయ్ జైన్, మహేష్ భగవత్‌లు రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేయడంతో పాటు వివరణ ఇవ్వాలని మహేష్, సంజయ్ జైన్‌లకు ఈసీ నోటీసులు పంపింది.