శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (15:47 IST)

కాంగ్రెస్ కొత్త రికార్డ్.. 26 ఏళ్లలోనే ఇద్దరు నేతలు... సీనియర్లపై గెలుపు

Mynampally Rohith Rao
Mynampally Rohith Rao
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక ఓట్లతో దూసుకుపోతోంది. ఈ కాంగ్రెస్ పార్టీలో అతి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేలుగా మారేవారున్నారు. కాంగ్రెస్ కేవలం 26 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు నేతలను కలిగివుంది. 
 
తెలంగాణ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పద్మాదేవిరెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు విజయం సాధించారు. ఆయన వయస్సు కేవలం 26 ఏళ్లు మాత్రమే. తన మొదటి ఎన్నికల్లోనే సీనియర్ అయిన పద్మారెడ్డిపై నెగ్గగలిగాడు. అయితే ఆయన తండ్రి మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి నుంచి ఓడిపోయారు.
Yeshaswini Reddy
Yeshaswini Reddy
 
కాంగ్రెస్‌కు చెందిన మరో 26 ఏళ్ల నేత ఎన్నికల్లో ప్రత్యర్థికి చుక్కలు చూపించారు. పాలకుర్తిలో ఆరుసార్లు ఎమ్మెల్యే, ఎర్రబెల్లి దయాకర్ రావును యశస్విని రెడ్డి ఓడించారు. తద్వారా తెలంగాణ ఎన్నికల చరిత్రలోనే ఇద్దరు పిన్న వయస్కులను సొంతం చేసుకుని కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించింది.