బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (17:05 IST)

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్...

bjp flags
అసెంబ్లీ ఎన్నికల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఊహించని షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. 
 
రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్యలు 90 కాగా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు 57 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ 33 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 71 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ కేవలం 14 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ దఫా తొలి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం చూపినప్పటికీ తర్వాత వెనకబడింది. .
 
మరోవైపు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తం 230 సీట్లున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి 165 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు, ఇతరులు ఒక స్థానంలో నిలిచారు. అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలో 199 సీట్లకు గాను బీజేపీ 115 సీట్లు, కాంగ్రెస్ 69, ఐఎన్డీ 7, ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.